Wednesday, July 3, 2024

బెంగళూరులో వెలుగు చూసిన తొలి డెంగ్యూ మరణం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ సీజను తొలి డెంగ్యూ మరణం నమోదయింది. 27 ఏళ్ల యువకుడు డెంగ్యూ కారణంగా చనిపోయాడు.  213 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బిబిఎంపి) తన హెల్త్ బులెటిన్ లో సోమవారం పేర్కొంది.

డెంగ్యూ తో మరణించడం ఈ ఏడాది ఇదే మొదటిది. కాగా హస్సన్, శివమొగ్గ, ధార్వాడ్, హవేరీ సహా ఇతర జిల్లాల్లో ఐదు డెంగ్యూ మరణాలు నమోదయ్యాయి. కాగా కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ యువకుడు, 80 ఏళ్ల వృద్ధురాలు డెంగ్యూ కారణంగా చనిపోయినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక శుక్రవారం గ్రహించింది. అయితే తర్వాత ఆ వృద్ధురాలు కేన్సర్ కారణంగా మరణించినట్లు స్పష్టీకరించింది. ఇకపోతే డెంగ్యూ వ్యాధితో చనిపోయిన యువకుడు బెంగళూరు శివారులో ఉన్న కగ్గదాసపురా కు చెందిన వ్యక్తి అని నిర్ధారణ అయింది. బెంగళూరు హెల్త్ ఆడిట్ ప్రకారం బెంగళూరు నగరంలో 213 కొత్త డెంగ్యూ కేసులు కనుగొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News