Wednesday, January 22, 2025

కర్నాటకలో 7000 కు చేరిన డెంగ్యూ కేసులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ వ్యాధి ఇప్పుడు కర్నాటకలో 7000 మందికి సోకింది. జులై 6 నాటికి కర్నాటకలో 7006 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా బెంగళూరులోనే అత్యధికంగా కేసులున్నాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూ రావు ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని సమాచారం.

బిజెపి పార్టీకి చెందిన నాయకుడు ఆర్. అశోక అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఆయన జయనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి డెంగ్యూ వ్యాధిగ్రస్తులను పరామర్శించారు. ఉచితంగా పేదలకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.  చెత్తాచెదారాన్ని తొలగించి దోమల నివారణకు పాటుపడాలన్నారు. నీరు నిల్వ ఉన్న చోట్ల ఫాగింగ్ చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News