Friday, January 10, 2025

త్వరలో అందుబాటు లోకి డెంగ్యూ వైరస్ వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

దేశంలో డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయి. కొంతమందికి కరోనా వైరస్‌తోపాటు ఈ విషజ్వరం కూడా సోకుతోంది. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో డెంగ్యూను కూడా నియంత్రించ గలిగితే ఆరోగ్యవ్యవస్థపై పడుతున్న తీవ్ర ఒత్తిడిని కాస్త తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే డెంగ్యూఆల్ అనే పేరుతో పనాసియా బయోటెక్ సంస్థ డెంగ్యూకు వ్యాక్సిన్ రూపొందిస్తోంది. ఈ వ్యాక్సిన్ తొలి, రెండు దశల ప్రయోగాల అధ్యయనం విజయవంతంగా పూర్తయింది.

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఈ ప్రయోగాల ఫలితాలను ప్రస్తుతం విశ్లేషిస్తోంది. ఇదెంతవేగంగా మార్కెట్లోకి ప్రవేశిస్తే అంత మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాలుగు రకాల డెంగ్యూ వైరస్ సెరోటైప్‌లను తమ టీకా సమర్ధంగా పనిచేస్తోందని పనాసియా సంస్థ తెలిపింది. వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేయడమే కాదు, ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించక పోవడం విశేషం. సింగిల్ డోస్ లోనే మెరుగైన ఫలితాలు ఇస్తోందని పనాసియా సంస్థ పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్ లోకి తీసుకురాడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పనాసియా బయోటెక్ ఎండీ రాజేష్ జైన్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News