Monday, December 23, 2024

భార్యతో శారీరక సంబంధం నిరాకరించడం నేరం కాదు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : భార్యతో శారీరక సంబంధాన్ని నిరాకరించడం తప్పేమీ కాదని, హిందూ వివాహ చట్టం ప్రకారం ఇది క్రూరమై అయినప్పటికీ, ఐపీసీ సెక్షన్ 498 ఎ ప్రకారం నేరం కాదని కర్ణాటక హైకోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్న భర్త .. తనతో శారీరక సంబంధానికి నిరాకరించడంతో ఓ భార్య పెట్టిన కేసు విచారణలో భాగంగా కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 2019 డిసెంబర్ 18న ఓ మహిళకు వివాహమైంది. అయితే భర్త అప్పటికే ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తుండడంతో ఆ మహిళతో శారీరక సంబంధానికి నిరాకరించాడు.

దీంతో పైళ్లైన 28 రోజులకే ఆమె పుట్టింటికి వెళ్లి పోయింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2020లో భర్త, అత్తమామలపై ఐపీసీ సెక్షన్ 498 ఎ , వరకట్న నిరోధక చట్టం కింద కేసు పెట్టింది. అదే విధంగా హిందూ వివాహ చట్టం ప్రకారం తన వివాహ బంధం పరిపూర్ణం కాలేదని కాబట్టి పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌పై ఫ్యామిలీ కోర్టు 2022 నవంబరులో వీరి వివాహాన్ని రద్దు చేసింది.

అయితే అత్తింటివారిపై పెట్టిన క్రిమినల్ కేసును మాత్రం వెనక్కు తీసుకోలేదు. దీంతో ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న అతడు .. ప్రేమ అంటే కేవలం మనుషులకు సంబంధినది మాత్రమే అని, శారీరక సంబంధం కాదని విశ్వసించాడని కోర్టు వివరించింది. అతడిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News