Sunday, January 19, 2025

మిస్ యూనివర్స్ 2024గా డెన్మార్క్‌ బ్యూటీ..

- Advertisement -
- Advertisement -

73వ మిస్ యూనివర్స్ విజేతగా డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా క్జెర్ థెల్విగ్ నిలిచింది. మెక్సికో సిటీలోని ఎరీనా సీడీఎంఎక్స్‌లో జరిగిన అందాల పోటీల్లో.. 21 ఏళ్ల బ్యూటీ విక్టోరియా 2024 మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో మిస్ యూనివర్స్ 2023, నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్(24).. కిరీటాన్ని థీల్విగ్‌కు అందజేసింది.

కాగా, ఈ కిరీటాన్ని దక్కించుకునేందుకు మొత్తం 125 మంది అందాల తారలు పోటీపడ్డారు. వెనిజులా, మెక్సికో, నైజీరియా, థాయ్‌లాండ్‌ దేశాలకు చెందిన అందగత్తెలు రన్నరప్‌లుగా నిలిచారు. ఇందులో మొదటి రన్నరప్‌గా నైజీరియాకు చెందిన చిదిమ్మా అడెత్షినా, రెండో రన్నరప్‌గా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News