Thursday, April 3, 2025

ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. వణికిపోతున్న జనం

- Advertisement -
- Advertisement -

ఉత్తరభారతాన్ని పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్ తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలను దట్టంగా పొగమంచు కమ్మింది. పొగమంచుకు తోడు చలిగాలులతో ఉత్తరాది ప్రజలు వణికిపోతున్నారు. బటయకు అడుగు పెట్టాలంటనే బయపడుతున్నారు. ఉదయం వేళలోనూ పొగ మంచు తగ్గడంలేదు.దీంతో విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు రైలు సర్వీసులు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక విమాన సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News