Sunday, December 22, 2024

యువకుడి ప్రాణం తీసిన దంత చికిత్స

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దంత చికిత్స కోసం వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వింజం లక్ష్మీనారాయణ(28) అనే యువకుడు దంత చికిత్స చేయించుకోవడానికి జూబ్లీహిల్స్లోని రోడ్ నెం. 37లో ఉన్న ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌కు వెళ్లాడు. లక్ష్మినారాయణ స్మైల్ డిజైనింగ్ అనే ప్రక్రియ కోసం క్లినిక్‌కు వెళ్లాడు. అయితే చికిత్స సమయంలో అతడికి అనస్థీషియా ఇచ్చారు.

మత్తు ఇవ్వడంతోనే లక్ష్మినారాయణ స్పృహ కోల్పోయాడు, వెంటనే వైద్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. అనస్థీషియా అధిక మోతాదులో ఇవ్వడం వల్లే మృతి చెందాడని, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు. చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.బాధితుడి తండ్రి వింజం రాములు దంత వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News