Tuesday, January 21, 2025

ఎసిబికి పట్టుబడిన డిఇఒ రవీందర్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ జిల్లా డిఇఒ రవీందర్ ఎసిబి చిక్కాడు. ఒక ఉపాధ్యాయుడి నుంచి డిఇఒ రవీందర్ లంచం తీసుకుంటూ దొరికాడు. ఒక ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డిఇఒకు విజ్ఞప్తి చేశారు. రూ.50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయుడు ఎసిబి డిఎస్పి కృష్ణ గౌడ్ ను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డిఇఒ ఇంటికి వెళ్లి 50 వేల రూపాయలు ఇస్తుండగా డిఎస్ పి కృష్ణ గౌడ్ బృందం డిఇఒను పట్టుకున్నారు. అనంతరం 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకొని రవీందర్ ను విచారణ చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News