Monday, December 23, 2024

పెళ్లి వేడుకలో ఘర్షణ… గన్‌తో కాల్పులు: వరుడి మేనమామ మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: పెళ్లి వేడుకలో ఘర్షణ జరగడంతో వరుడి మేనమామపై కాల్పులు జరపడంతో అతడు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం డియోరియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. వివాహ వేడుక జరుగుతుండగా  వరుడి మేనమామ బజ్రంగి నిషాద్, ఓ ప్రకాశ్ నిషాద్ మధ్య గొడవ జరగడంతో పెళ్లిని ఆపేశారు. ఓం ప్రకాశ్ నిషాద్ అనే వ్యక్తి బజ్రంగి నిషాద్ ను కాల్చామని తన మేనల్లుడికి చెప్పాడు. వెంటనే గుంపులోకి వ్యక్తి తుపాకీతో కాల్చాడంలో వరుడి మేనమామ బజ్రింగి పొట్టలోనికి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బ్లీడింగ్ ఎక్కువ కావడంతో వెంటనే గోరఖ్‌పూర్‌లోని బిఆర్‌డి మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఆయన తీవ్రంగా గాయపడడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఐపిసి 302 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. లైసెన్స్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: త్వరలో మరో రెండు గిరిజన గురుకులాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News