Monday, December 23, 2024

రిజిస్ట్రేషన్ల జోరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో దూసుకుపోతోంది. రెండేళ్లలో రెట్టింపు స్థాయిలో ఆదాయాన్ని పెంచుకుంది. గత సంవత్సరం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు, మార్కెట్ వాల్యూతో అనుకున్నమేర వృద్ధిని ఆ శాఖ సాధిస్తోంది. (2021-22) గత ఆర్థిక సం వత్సరం కన్నా 202220-23 ఆర్థిక సంవత్సరంలో 25 శాతం అధిక రాబడిని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేష న్ శాఖ ఈ మేరకు రూ.15,600 కోట్లు ల క్ష్యంగా నిర్ధేశించుకుంది. ప్రతి నెలకు సగటున రూ.1,350 కోట్లకు తక్కువ లేకుం డా రాబడి రావాలని నిర్ధేశించుకోవడంతో పాటు లక్ష్యం చేరుకునేలా ప్రణాళికలు రూపొందించింది.

ఇప్పటికే సుమారుగా రూ.11,829.19 వేల కోట్ల ఆదాయాన్ని (జనవరి, 31, 2023 నాటికి) ఆ శాఖ ఆర్జించగా మొత్తం 16.03 లక్షల డాక్యుమెంట్ల ద్వారా ఈ ఆదాయాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రాబట్టుకుంది. మార్చి 31 వ తేదీలోగా మరో రూ.3,770.81 కోట్ల ను రాబట్టుకునేలా ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఆ శాఖ ఆశించిన విధంగా మార్చి నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్‌లు జరిగితే అధికారులు అంచనా వేసిన దానికంటే వంద, రెండొందల కోట్ల ఆదాయం ఎక్కువే వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

2014-15లో 8.26 లక్షల లావాదేవీలు

ఏటా పెరుగుతున్న భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ లావాదేవీలు 2021-22లో అత్యధికంగా 19.88 లక్షల లావాదేవీలు, రూ.12, 364 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అంతకుమించి రూ.15వేల కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 2014-15లో 8.26 లక్షల లావాదేవీలు, రూ.2.707 కోట్ల ఆదాయం రాగా ఈ ఎనిమిదేళ్లలో 7 రెట్ల ఆదాయం పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న రియల్‌ఎస్టేట్ లావాదేవీలు, వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల నేపథ్యంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. భూములు, ఆస్తుల క్రయ,విక్రయాలు చాలావరకు హైదరాబాద్ చుట్టూనే జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మెజార్టీ లావాదేవీలు జరుగుతుండగా, హన్మకొండ, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలు తరువాతి స్థానాల్లో నిలుస్తున్నాయి.

గత సంవత్సరం ఫిబ్రవరిలో…

ఈ శాఖ నుంచి వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ప్రధాన వనరుగా మారింది. గత సంవత్సరం ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. భూముల మార్కెట్ విలువల సవరింపు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణ రివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూస్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ 1998 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించింది. 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి. కాగా, వ్యవసాయ భూముల్లో సుమారు 50 శాతం వరకు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌లలో 35 శాతం వరకు పెంపు వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోడవడంతో ఆదాయం పెరిగింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆల్‌టైం రికార్డు

2021-22 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.12,364 కోట్ల రాబడి, 19.88 డాక్యుమెంట్ల ద్వారా రాగా ఇది స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు ఆల్‌టైం రికార్డు ఆదాయంగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో గత సంవత్సరం వచ్చిన ఆల్‌టైం రికార్డు ఆదాయాన్ని ఇప్పటికే చేరువకావడం గమనార్హం. 2014-15 సంవత్సరంలో రూ.2,707 కోట్లు రాగా, 2015-16 సంవత్సరంలో 10.62 డాక్యుమెంట్‌లు రూ.3,786 కోట్ల ఆదాయం, 2016-17 సంవత్సరంలో 10.63 లక్షల డాక్యుమెంట్‌లు, రూ.4,249 కోట్లు, 201718 సంవత్సరంలో 11.50 లక్షల డాక్యుమెంట్‌లు రూ.5,177 కోట్ల ఆదాయం సమకూరింది. 2018-19 ఆర్థిక ఏడాదిలో 15.2 లక్షల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రూ.6,612.75 కోట్లు ఆదాయం రాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 16.58 లక్షల డాక్యుమెంట్ల ద్వారా రూ.7,061 కోట్ల రాబడి, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 12.11లక్షల డాక్యుమెంట్‌లు, రూ.5,260.20 కోట్ల ఆదాయం సమకూరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News