Saturday, April 5, 2025

నవంబర్‌లో డిపార్టుమెంటల్ పరీక్షలు : టిఎస్‌పిఎస్సి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఆన్‌లైన్ మోడ్‌లో సిబిటి పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. హెచ్‌ఎండిఏ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్ పాటు రాష్ట్రంలోని పూర్వపు జిల్లా ప్రధాన కార్యాలయంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు దరఖాస్తును సమర్పించే సమయంలో తమ పని చేసే జిల్లాతో పాటు పరీక్షకు హాజరు కావడానికి పరీక్షా కేంద్రం కోసం జిల్లా ప్రాధాన్యతలను ఎంచుకోవాలని సూచించింది. వివరాలు ఇతర అవసరమైన సమాచారం కోసం, అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.inలో చూడవచ్చని తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఈనెల 8వ నుంచి అక్టోబర్ 10 తేదీలోగా సమర్పించాలని పరీక్షలు నవంబర్ 17వ తేదీ నుంచి 25వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News