Saturday, November 16, 2024

భీమారంలో కేంద్ర బలగాల మోహరింపు

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భీమారం గోపాలపూర్‌లో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు. కేయూ సీఐ అబ్బయ్య ఆధ్వర్యంలో భీమారం నుంచి గోపాలపూర్ వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగబోయే ఎన్నికల్లో భాగంగా శాంతి భద్రతల దృష్టా సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు కేంద్ర బలగాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.

అర్హత కల్గిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సతీష్ రాజు రైటర్ రాజ్‌కుమార్, సిబ్బంది, హోంగార్డు కుమార్, కేంద్ర బలగాలు పాల్గొన్నారు.
* ఖానాపురంలో.. మండలంలోని అశోక్‌నగర్ గ్రామంలో దుగ్గొండి సీఐ పి. కిషన్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరుగకుండా కవాతు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కవాతులో ఖానాపురం ఎస్సై బొంగు మాధవ్‌గౌడ్, పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News