- Advertisement -
కర్నల్ : ఆగస్టు 28 న రైతులపై జరిగిన పోలీస్ లాఠీ ఛార్జీపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున రైతులు బుధవారం జిల్లా ప్రధాన కేంద్ర కార్యాలయం బయట బైఠాయించారు. హర్యానా ప్రభుత్వ స్థానిక అధికార వర్గాలతో చర్చలు విఫలమైన తరువాత మంగళవారం సాయంత్రం నుంచి మినీ సెక్రటేరియట్ వద్దనే రైతులు బైఠాయింపు కొనసాగిస్తున్నారు. రాత్రంతా గేటు బయటనే గడిపారు. రైతులు హద్దు మీరితే వారి తలలు పగుల గొట్టాలని ఆదేశించిన కర్నల్ మాజీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, ఐఎఎస్ ఆఫీసర్ ఆయుష్ సిన్హాను తక్షణం సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -