త్వరలో కొత్త సదుపాయం తీసుకువస్తాం, రెపోరేటు యథాతథంగా కొనసాగింపు.
202425కు జిడిపి అంచనా 7 శాతం, ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
ముంబై : యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) విధానం ద్వారా బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేసే సౌకర్యాన్ని త్వరలో తీసుకురానున్నామని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాం త దాస్ ప్రకటించారు. ఆర్‌బిఐ ఎంపిసి (ద్రవ్యపరపతి విధాన కమిటీ) సమీక్ష వివరాలను గవర్నర్ శక్తికాంత దా స్ మీడియాకు వెల్లడించారు. యుపిఐ సిస్ట మ్ ద్వారా కూడా బ్యాంకులో డబ్బులు డి పాజిట్ చేయవచ్చని, ఈ సదుపాయంతో ప్రాంతాలకు డబ్బు పంపే సమయం ఆదా అవుతుందని ఆయన వివరించారు.
ప్రస్తుతం నగదు తీసుకుని మెషిన్‌లో వేయాలి, మొత్తం ప్రక్రియ పూర్తయితేనే డబ్బు ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ద్వారా నగదు డిపాజిట్ల కు ఆర్‌బిఐ అనుమతినిచ్చిందని శక్తికాంత తెలిపారు. ప్రస్తుతం కార్డు రహి త నగదును ఎటిఎం నుంచి విత్‌డ్రా ప్రస్తుతం చాలా మంది వినియోగదారులు ఏటిఎంలలో డబ్బును డిపాజిట్ చేసేందుకు నగదుతోపాటు డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఈ నగదు డిపాజిట్ యంత్రాలు బ్యాంకు ఉద్యోగుల పనిని తగ్గించడంలో ఎంతగానో దోహదం చేస్తున్నాయి. దీంతో బ్యాంకుల వద్ద పొడవైన క్యూలు కూడా తగ్గాయి. అందువల్ల ఈ సేవను మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నామని ఆర్‌బిఐ గవర్నర్ అన్నారు.
త్వరలో మార్గదర్శకాలు
బ్యాంకులో యుపిఐ ద్వారా డబ్బు డిపాజి ట్ చేసేందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పిపిఐ) ద్వారా యుపిఐ చెల్లింపును పిపిఐ జారీచేసేవారి వెబ్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే చేయవచ్చు. ఇప్పుడు పిపిఐ వాలెట్ ద్వారా యుపిఐ చెల్లింపు చేయడానికి థర్డ్ పార్టీ యుపిఐ యాప్‌ను అనుమతించే ప్రతిపాదన ఉంది. అంతేకాకుండా చిన్న లావాదేవీలకు కూడా డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహిస్తామని గవర్నర్ అన్నారు.
కొత్త వ్యవస్థ ఎలా పని చేస్తుంది?
యుపిఐ ద్వారా నగదు డిపాజిట్ చేసే ఈ విధానం ప్రస్తుతం కొనసాగుతున్న విత్‌డ్రా ప్రక్రియను పోలి ఉంటుంది. ప్రస్తుతం కా ర్డ్‌లెస్ నగదును విత్‌డ్రా చేయాలనుకుంటే, యుపిఐ కార్డ్‌లెస్ నగదు ఎంపికను ఎంచుకోవాలి. దీని తర్వాత మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత యుపిఐ పిన్‌ను నమోదు చేయ డం ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. డబ్బులు డిపాజిట్ చేసే విధానం కూడా ఇదే విధంగా ఉండబోతోంది.
ఇఎంఐ చెల్లించే వారికి ఊరట లేదు
వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆశించిన ఇఎంఐ చెల్లింపుదారులు, ప్రజలు నిరాశే ఎదురైం ది. ఆర్‌బిఐ సమీక్షలో బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి రెపో రేటును 6 మంది సభ్యులలో 5 మంది స భ్యులు రెపో రేటును మార్చకూడదని ఓటు వేశారు. రెపో రేటును 6.50 శాతం వద్ద స్థిరంగా ఉండనివ్వాలని ఎంపిసి నిర్ణయించినట్లు గవర్నర్ తెలిపారు. ఆర్‌బిఐ క్ష్మీపో రేటులో ఎలాంటి మార్పు చేయకపోవడం ఇది వరుసగా ఏడోసారి.
రిజర్వ్ బ్యాంక్ ఎంపిసి చివరిసారిగా రెపో రేటును 14 నెలల క్రితం 2023 ఫిబ్రవరిలో మార్చిం ది. అప్పట్లో రెపో రేటును 6.50 శాతానికి పెంచారు. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం పైన ఉండగా, 4 శాతం దిగువకు తీసుకోవాలని ఆర్‌బిఐ భావిస్తోంది. ఫిబ్రవ రి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.09 శాతానికి తగ్గింది. మార్చి నెల గణాంకాలు ఇం కా విడుదల కాలేదు. డిసెంబర్ త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 8 శాతానికి పైగా ఉంది. మార్చి త్రైమాసికంలో మొత్తం ఆర్థి క సంవత్సరం 2023-24లో వృద్ధి రేటు 8 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని అంచ నా. ప్రస్తుత సిరీస్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగజారినప్పటికీ, ఆహార పదార్థాల పరంగా ద్రవ్యోల్బణం పరిస్థితి అనిశ్చితంగానే ఉందని గవర్నర్ చెప్పారు.