Sunday, December 22, 2024

దెప్సాంగ్, దెమ్‌చోక్‌లో ఉపసంహరణ తొలి అడుగు

- Advertisement -
- Advertisement -

తదుపరి ఉద్రిక్తతల సడలింపు
చైనాపై జైశంకర్

ముంబయి : లడఖ్‌లో దెప్సాంగ్, దెమ్‌చోక్‌లలో సేనల ఉపసంహరణ తొలి అడుగు అని, భారత్ 2020 గస్తీ స్థాయికి తిరిగి వెళుతుందని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి (ఇఎఎం) ఎస్ జైశంకర్ ఆదివారం చెప్పారు. తదుపరి చర్య ఉద్రిక్తతల సడలింపు అని, ఆవలి పక్షం నుంచి అది జరుగుతోందని భారత్ నమ్మేంత వరకు అది జరగబోదని ఇఎఎం చైనాను దృష్టిలో పెట్టుకుని స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనను అంతం చేస్తూ తూర్పు లడఖ్‌లో ఎల్‌ఎసి పొడుగునా గస్తీపై చైనాతో ఒప్పందానికి వచ్చినట్లు భారత్ ఈ వారం ఆరంభంలో ప్రకటించింది. జైశంకర్ ముంబయిలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, దెప్సాంగ్, దెమ్‌చోక్‌లలో గస్తీ, సేనల ఉపసంహరణపై ఏకాభిప్రాయం సాధించినట్లు చెప్పారు.

‘దానిని అమలు చేయడానికి వ్యవధి పడుతుందనేది వాస్తవం. ఇది సేనల ఉపసంహరణ, గస్తీకి సంబంధించిన అంశం. అంటే మన సేనలు పరస్పరం ఎదురుపడే స్థితికి వచ్చాయి. ఇప్పుడు అవి తమ స్థావరాలకు తిరిగి వెళ్లవలసి ఉంటుంది. 2020 స్థాయి తిరిగి నెలకొంటుందని ఆశిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. సేనల ఉపసంహరణ పూర్తి అనేది తొలి అడుగు అని, తదుపరి అడుగు ఉద్రిక్తతల సడలింపు అని, ఆవలి వైపు కూడా అది జరుగుతోందని భారత్ నమ్మేంత వరకు అది జరగబోదని ఇఎఎం వివరించారు. ‘ఉద్రిక్తతల సడలింపు అనంతరం సరిహద్దుల నిర్వహణ ఎలా అనేది చర్చించనున్నాం’ అని జైశంకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News