- Advertisement -
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. జ్వరం, దగ్గు ఉండడంతో ఆమెకు కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో హోంఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తనని కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరారు. జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
- Advertisement -