Thursday, January 9, 2025
- Advertisement -
- Advertisement -

ఈవిఎం, వివి ప్యాడ్లను పరిశీలించిన పుదుచ్చేరి డిప్యూటీ సిఇఒ

వికారాబాద్ : ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగించే ఈవీ ఎంలు, వివి ప్యాడ్స్, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ను పుదుచ్చేరి డిప్యూటీ సీఈవో బి.తిల్లయ్వెల్ పరిశీలించారు. గురువారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం పక్కన గల ఈవీఎం గోడౌన్ లో భద్రపరిచిన ఓటింగ్ యంత్రాలను జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఎన్నికల సామాగ్రిని ఒక్కొక్కటిగా పరిశీలించారు. ఇక్కడే ఉన్న వివిధ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ పరికరాల పరిశీలనను అడిగి తెలుసుకు న్నా రు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవో విజయ్‌కుమారి, ఎలక్షన్ డిప్యూటీ తహసిల్దార్ రవీందర్ దత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News