- Advertisement -
తెలంగాణ ప్రజలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగీ, సంక్రాంతి, కనుమ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. త్వరలోనే తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను వంద శాతం అమలు చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు ఆదివారం భోగి వేడుకలను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.
- Advertisement -