Monday, January 20, 2025

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోదరుడు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. భట్టివిక్రమార్క సోదరుడు వెంకటేశ్వరరావు(70) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయుర్వేద వైద్యుడుగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈరోజు చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. మరికాసేపట్లో ఆయన బౌతికకాయాన్ని వైరాకు తరలించనున్నారు. దీంతో భట్టి విక్రమార్క మేడిగడ్డ పర్యటనను రద్దు చేసుకుని వైర వెళ్లనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News