Saturday, December 21, 2024

ఖమ్మంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పర్యటన

- Advertisement -
- Advertisement -

మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి సాగునీటి ప్రాజెక్టలపై సమీక్ష
విద్యార్థులకు పుస్తకాలు యూనిఫాం పంపిణీ
13న సీతరామ ప్రాజెక్టు పనుల పరిశీలన

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క మల్లు నేటి నుండి రెండు రోజుల పాటు ఖమ్మంలో పర్యటించనున్నారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించి అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో పాలనపై ప్రత్యేక దృష్టి సారించిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

గత ప్రభుత్వం నిర్లక్షం చేసిన సీతరామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్యం జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే లక్షంగా ఇప్పటికే సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డితో కలిసి పలుమార్లు రాష్ట్ర సచివాలయంలో సమీక్షలు నిర్వహించారు. అయితే వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రాజెక్టును ఈనెల 13వ తేదీన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సందర్శించనున్నారు. అధికారులు కాగితాల్లోనే చూపించిన ప్రాజెక్టు పురోగతి, వాస్తవ స్థితిని పరిశీలించిన అనంతరం అక్కడే అధికారులకు సమీక్ష నిర్వహించి త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి దశ దిశ నిర్ధేశం చేయనున్నారు. పట్టువదలని విక్రమార్కుడిగా ఇందిరాగాంధీ, రాజీవ్ సాగర్ (సీతరామ) ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డిప్యూటీ సిఎం ఎంతో పట్టుదలతో ఉండటంతో అందుకు తగ్గట్టుగా మంత్రుల పర్యటనకు ఏర్పాట్లను పూరర్తి చేశారు.

డిప్యూటీ సిఎం పర్యటన వివరాలు :

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు రెండు రోజుల పాటు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పర్యటించే వివరాలు ఇవి. ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు నుండి పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం ఎన్.ఎస్.పి క్యాంపు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం పంపిణీ చేయనున్నారు. ఆ తరువాత ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై ఉన్నతాధికారులతో శాఖల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.

మధ్యాహ్నం ౩.౩౦కి మధిర నియోజకవర్గం చింతకాని మండలం వందనం పుట్టకోట, పాతర్లపాడు గోవిందపురం గ్రామాల మధ్యన పంచాయితీరాజ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈనెల 13వ తేదీన ఉదయం 8.30 గంటలకు సీతరామ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు దుమ్ముగూడెంకు చేరుకొని సీతరామ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ రెగ్యూలేటర్, ఆశ్వారావుపేట మండలం బిజి కొత్తూరులోని పంప్ హౌస్, కెనాల్, ముల్కలపల్లి మండలం పంప్ హౌస్ 2, కమలాపురం మండలం పూసుగూడెం లోని పంప్‌హౌస్ 3, కెనాల్స్ పనులను పరిశీలిస్తారు. అలాగే కమలాపురం వయా పాల్వంచ, కొత్తగూడెం, జూలూరుపాడు మీదుగా ఎన్కూర్ లింక్ కెనాల్ పనులను తనిఖీ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News