Wednesday, January 22, 2025

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం

- Advertisement -
- Advertisement -

కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. మంగళవారం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడంతో వారికి టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయ రంగనాయకుల మండపంలో భట్టి విక్రమార్క కుటుంబానికి పండితులు వేద ఆశీర్వచనం చేశారు.

టిటిడి ఈఓ ధర్మారెడ్డి శేషవస్త్రం తో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను, 2024 టీటీడీ డైరీ, క్యాలండర్ ను అందజేశారు. అనంతరం ఆలయం బయట భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండాలని , రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన అద్భుతమైన తీర్పును ఇచ్చారని ,తాను నిర్వర్తించే ఆర్థిక శాఖలో ఆర్థిక వనరులు అభివృద్ది చెందేలా కృషి చేస్తానని, పార్టీ పరంగా ఆరు గ్యారెంటీలను నేరవేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News