Sunday, December 22, 2024

ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సిఎం

- Advertisement -
- Advertisement -

నేడు రాహుల్‌తో కలిసి
ఒడిశాకు పయనం..ఎన్నికల
ప్రచారంలో పాల్గొనున్న భట్టి

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం ఆయన రాహుల్ గాంధీతో కలిసి ఒరిస్సా రాష్ట్రంలోని బోలంగిర్ లోక్ సభ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు.

బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బొలంగిర్ లోక్ సభ స్థానానికి చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రంలో మూడు దఫాలుగా ప్రచారం నిర్వహించారు. కటక్ లో ఒకరోజు, భువనేశ్వర్ లో రెండు రోజులపాటు, రాయగడ పార్లమెంటు పరిధిలో రెండు రోజులపాటు ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. తాజాగా నాలుగోసారి ఒరిస్సా రాష్ట్రంలోని బోలంగిర్ పార్లమెంటు పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News