Sunday, December 22, 2024

మా అప్పు రూ. 49,618కోట్లే!

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎడాపెడా అప్పులు చేస్తోందంటూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. తమ ప్రభుత్వం ఏర్పాటు వచ్చాక చేసిన అప్పులు, వ్యయానికి సంబంధించిన వివరాలతో డిప్యూటి సీఎం ప్రకటన విడుదల చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక తీసుకున్న రుణాలు, తిరిగి చెల్లించిన వడ్డీ కలిపి మొత్తం (డిసెంబర్ 2023 నుంచి అక్టోబర్ 15, 2024 వరకు) వివరాలను పేర్కొన్నారు.తమ ప్రభుత్వం వచ్చాక తీసుకున్న రుణం రూ. 49,618 కోట్లు కాగా గత ప్రభుత్వం (బీఆర్‌ఎస్) చేసిన రుణాల అసలు,

వడ్డీని కలిపి రూ.56,440 కోట్లు చెల్లించినట్టు పేర్కొన్నారు. ఇదే కాకుండా తమ ప్రభుత్వం మూలధనం కింద రూ.21,౮౮౧ కోట్లు ఖర్చు చేయడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతగల పథకాలతో పాటు రైతుల రుణమాఫీ, రైతు భరోసా, చేయూత, ఎల్‌పిజి సిలిండర్లపై సబ్సిడీ, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద, బియ్యంపై సబ్సిడీ, స్కాలర్ షిప్స్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలు అన్నింటిపై డిసెంబర్ 2023 నుంచి అక్టోబర్ 2024 వరకు మొత్తం రూ.54,346 కోట్లు ఖర్చు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News