Wednesday, January 22, 2025

ఖమ్మం ఎంపి టికెట్ కోసం డిప్యూటీ సిఎం సతీమణి దరఖాస్తు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం ఉప ముఖ్యమంత్రి సతీమణి నందిని మల్లు భట్టి విక్రమార్క దరఖాస్తు చేసుకున్నారు. శనివారం గాంధీ భవన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత ఆమె మాట్లాడుతూ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఖమ్మం జిల్లా నుండి పోటీ చేయాలని కోరామని, వారు పోటీ చేస్తే అందరం కలిసి కట్టుగా పని చేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఖమ్మం నుండి పోటీ చేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు వెల్లడించారు. తనకు అవాకాశం ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తా,నన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. తెలంగాణలో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, దేశంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయం మని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News