Monday, December 23, 2024

ప్రొ. కోదండరాంకు డిప్యూటీ కలెక్టర్స్ ,తహసీల్దార్ అసోసియేషన్ అభినందన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ : నూతనంగా ఎమ్మెల్సీగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాంకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం ప్రొఫెసర్ కోదండరాంను వారి నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ఉన్నతమైన పదవిని చేపట్టి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని కోరారు. కోదండరామ్‌ను కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె. రామకృష్ణ, అసోసియేట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు వై. శ్రీనివాస్ రెడ్డి, పులి సైదులు, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్. రాములు, రమేష్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News