Monday, December 23, 2024

భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల జాతర కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం భారీగా డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. 28 మందికి స్థానం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మధుసూదన్ నాయక్ మంచిర్యాల నుంచి ఖమ్మం, జి రమేష్ మెదక్ నుంచి యుఎల్‌సి హైదరాబాద్, డి. వేణుగోపాల్ వెయిటింగ్ పోస్టింగ్ ములుగు, కె. వెంకటేశ్వర్లు వెయిటింగ్ బదిలీ భూపాలపల్లి, ముషిని వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్, సీతారాం వెయింగ్ పోస్టింగ్ అసిఫ్‌బాద్, నూతి మధుసూదన్ ఖమ్మం నుంచి హైదరాబాద్ జిల్లాకు నియమించింది. పద్మశ్రీ మహబూబ్‌నగర్ నుంచి రెవెన్యూ అధికారి మెదక్, జి. వెంకటేశ్వర్లు వెయిటింగ్ బదిలీ మెదక్, వి. భుజరంగరావు సెక్రటరీ వేముల దేవస్ధానం నుంచి ఆర్డీవో బాన్సువాడ, కె. శ్యామల దేవి ఆర్డీవో బెల్లంపల్లి నుంచి ఎస్‌డిసి ఉట్నూర్, జెఎల్‌బి హరిప్రియ ఎస్‌డిసి రంగారెడ్డి నుంచి ఆర్డీవో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాధ్యతలు అప్పగించింది.

డి. వేణు ఆర్డీవో మంచిర్యాల నుంచి స్పెషల్ కలెక్టర్ మహబూబ్‌నగర్, మధుమెహన్ ఆర్డీవో నారాయణఖేడ్ నుంచి ఆర్డీవో పెద్దపల్లి, డి. కొమరయ్య ఆర్డీవో మహబూబాబాద్ నుంచి ఆర్డీవో నారాయణఖేడ్, టిఏవి నాగలక్ష్మి ఆర్డీవో నాగర్‌కర్నూల్ నుంచి ఎస్‌డిసి పరిశ్రమల శాఖ మేడ్చల్ మల్కాజిగిరి, ఆర్ దశరథ ఎస్‌డిసి ఖమ్మం నుంచి ఆర్డీవో స్టేషన్ ఘన్‌పూర్‌కు బదిలీ చేసింది. కె. స్వర్ణలత ఆర్డీవో కొత్తగూడెం నుంచి ఆర్డీవో ఖమ్మం, వి. హనుమ ఆర్డీవో కొల్లాపూర్ నుంచి ఆర్డీవో మంథని, టి. రవి వెయిటింగ్ ఆర్డీవోగా సికింద్రాబాద్‌కు స్థానం చలనం కల్పించింది. మాధవి వెయిటింగ్ పోస్టింగ్ ఆర్డీవో భద్రాచలం, శకుంతల వెయింగ్ ఆర్డీవో మంచిర్యాలకు బదిలీ, డి. చంద్రకళ వెయిటింగ్ బదిలీ ఆర్డీవో గద్వాల్, వి.రాములు ఆర్డీవో గద్వాల్ నుంచి ఆర్డీవో నాగర్‌కర్నూల్ , అలివేలు వెయిటింగ్ పోస్టింగ్ ఆర్డీవో మహబుబాబాద్, కెఎస్‌బి కుమారి ఎస్‌డిసి హైదరాబాద్ నుంచి ఎస్‌డిసి రంగారెడ్డి, పి. నాగరాజు వెయిటింగ్ బదిలీ కొల్లాపూర్, ఆర్. శిరీష్ ఆర్డీవో ఖమ్మం నుంచి ఆర్డీవో కొత్తగూడెంకు బదిలీ చేసినట్లు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News