గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపంను శుద్ధి చేస్తున్న మాజీ డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్ తదితరులు
అమరుల ఆత్మ క్షోభకు గురిచేయొద్దు : టిఆర్‌ఎస్‌వి
మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు పాల్గొనని పిసిసి రేవంత్‌రెడ్డి రాకతో అమరవీరుల స్తూపం అపవిత్రమైందని మాజీ డిప్యూటి మేయర్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. సోమవారం గన్‌పార్క్ వద్దనున్న అమరవీరుల స్థూపాన్ని పాలు, గంగాజలంతో టీఆర్‌ఎస్ శ్రేణులు శుద్ధి చేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు అమరవీరుల స్తూపాన్ని అగౌరపర్చారని టిఆర్‌ఎస్‌వి నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్, తుంగబాలు, మధుకర్‌యాదవ్, అనిల్‌గౌడ్, మేకల రవి, సుధీర్, శ్రీకాంత్‌గౌడ్, రాజులు పాల్గొని అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి అమరవీరుల స్తూపం వద్దకు వచ్చే అర్హత లేదన్నారు. ఆంధ్రాబాబుకు తొత్తుగా మారిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్, కేటిఆర్‌పై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైట్ ఛాలెంజ్‌ను ముందుగా చంద్రబాబు, లోకేష్, రాహుల్‌గాంధీ, కొండ విశ్వేశ్వర్‌రెడ్డితో చేయించాలన్నారు. ఎవరికి పనికి వచ్చేది ఈ ఛాలెంజ్.. సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని వారు మండిపడ్డారు.
అమరవీరుల స్తూపం వద్ద డ్రగ్స్‌పై ఛాలెంజ్ చేయడం అమరవీరులను కించపర్చడమేన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం.. స్వరాష్ట్రం కోసం అమరులైన వారి జాపకం కోసం ఏర్పాటు చేసిన స్తూపం వద్ద రాజకీయ ఎత్తుగడకు, మీ రాజకీయ అవసరాలకు వేదిక చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. మీ దందాలు, మీ డ్రగ్స్ ఛాలెంజ్‌లు అమరవీరుల స్తూపం వద్ద కాకుండా ఎక్కడైన పెట్టుకోండి అన్నారు. అమరుల ఆత్మను క్షోభకు గురిచేయోద్దని హెచ్చరించారు.