Monday, December 23, 2024

ఉప సర్పంచ్ ను హత్య చేసిన మావోలు

- Advertisement -
- Advertisement -

 Deputy Sarpanch murder by maoist in cherla

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి పంచాయతీకి చెందిన ఉప సర్పంచ్ ను మావోయిస్టులు చంపేశారు. పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడనే అనుమానంతో ఉపసర్పంచ్ ఇర్పరామారావును హత్య చేశారు. సోమవారం అర్థరాత్రి సమయంలో నలుగురు మావోలు రామారావు ఇంటికి వచ్చి బయటకు తీసుకెళ్లారు. భార్య పిల్లలు ఎంత బతిమిలాడిన అతడిని తమ వెంట మావోలు లాకెళ్లారు. గ్రామ శివారులోకి వెళ్లిన తరువాత రామారావును నరికి చంపారు. సిపిఐ మావోయిస్టు చెర్ల-శబరి పేరిటి ఓ లేఖను విడుదల చేశారు. తమ గురంచి పోలీసులు సమాచారం ఇస్తే ఇదే గతి పడుతుందని లేఖలో మావోలు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News