Monday, December 23, 2024

స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన డిప్యూటీ తహసీల్దారుపై వేటు!

- Advertisement -
- Advertisement -
ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన ప్రభుత్వం
మెడ్చేల్ కలెక్టర్ ఆదేశాలు జారీ
చంచల్‌గూడ జైలులో ఆనంద్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిపై ప్రభుత్వం చర్య తీసుకుంది. ఆనంద్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. మేడ్చల్ కలెక్టర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆనంద్‌కు రెవెన్యూ అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులను అందించనున్నారు.

మేడ్చేల్ జిల్లా డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆనంద్ కుమార్ రెడ్డి, తన స్నేహితుడు బాబుతో కలిసి ఈనెల 19 అర్ధరాత్రి కారులో జూబ్లీహిల్స్‌లోని ప్లజెంట్ వ్యాలీకి చేరుకున్నారు. బాబు కారులోనే ఉండగా ఆనంద్ కుమార్ రెడ్డి, స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డాడు. తలుపు కొట్టడంతో స్మితా సబర్వాల్ పోలీసులకు ఫోన్ చేశారు. ఈలోపు భద్రతా సిబ్బంది ఆనంద్, బాబును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందిలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టాక న్యాయమూర్తి నిందితులు ఇద్దరికీ 14 రోజుల రిమాండ్‌ను విధించారు. ప్రస్తుతం ఆనంద్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ ఘటనపై కేసు విచారణ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News