Thursday, January 23, 2025

ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్‌ చొరబాటు

- Advertisement -
- Advertisement -

 

మహిళా ఐఏఎస్‌ ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ఓ డిప్యూటీ తహసీల్దార్‌ చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటి తహసీల్దార్ ఆనంద్ అనే వ్యక్తి తలుపులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఉద్యోగం విషయం మాట్లాడేందుకు అంటూ ఆ వ్యక్తి చెప్పగా ఇంట్లోకి వచ్చిన ఆనంద్ కుమార్ ను చూసి ఆ అధికారిణి కేకలు వేయడంతో భద్రతా సిబ్బంది అతడ్ని పట్టుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ తో పాటు అతని వెంట వచ్చిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన పై స్మితాసబర్వాల్ స్పందిస్తూ రాత్రి భయంకరమైన అనుభవం ఎదురైందని , ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడని ఆ సమయంలో ఎలా రక్షించుకోవాలని ఆలోచించానని తెలిపింది. మనం ఎంత సంరక్షంగా ఉన్న డోర్ లాక్ వేసామో లేదో మళ్లి చెక్ చేసుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు 100కి కాల్ చేయాలని స్మితా సబర్వాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News