Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ గ్రామానికి చెందిన బాల కృష్ణ(47) ఇబ్రహీంపట్నం ఆర్‌డిఒ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేశారు. బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం కోసం శిరిడీకి వెళ్లారు. దైవ దర్శనం చేసుకొని ఇంటికి వస్తుండగా కర్నాటకలోని బసవ కల్యాణి సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తన కారును బాలకృష్ణ రోడ్డుపై ఆపారు. టైర్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పల్టీలు కొట్టింది. వాహనంలో ఉన్న టైర్లు బాలకృష్ణ కారుపై పడ్డాయి. ఊపిరాడక బాలకృష్ణ ఘటనా స్థలంలోనే చనిపోయారు. కారులో అతడి కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ మృతిపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొహెడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News