Monday, December 23, 2024

పెరోల్‌పై విడుదలైన డేరా బాబా

- Advertisement -
- Advertisement -

రోహ్‌తక్ : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరాబాబా 40 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. శుక్రవారం నాడు ఆయనకు హర్యానా కోర్టు పెరోల్ మంజూరు చేయగా, జైలు నిబంధనలు పూర్తి చేసుకుని శనివారం నాడు రోహ్‌తక్ జిల్లా సునరియా జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. ఇద్దరు మహిలా భక్తులపై అత్యాచారం కేసులో ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.

పెరోల్‌లో విడుదలైన డేరా బాబా ఈ నెల 25 న జరిగే సచ్చా సౌదా మాజీ చీఫ్ షా సత్నం సింగ్ జయంతికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనికి ముందు మూడు నెలల క్రితం కూడా ఇదే తరహా పెరోల్‌పై డేరా బాబా విడుదలయ్యారు . ఆ వెంటనే ఆయన ఉత్తర ప్రదేశ్ లోని బర్నావా ఆశ్రమానికి వెళ్లారు. నిబంధనల ప్రకారమే ఆయనకు తాజాగా 40 రోజుల బెయిల్ మంజూరు చేసినట్టు రోహ్‌తక్ డివిజనల్ కమిషనర్ సంజీవ్ శర్మ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News