Monday, December 23, 2024

డేరా బాబాకు మళ్లీ పెరోల్

- Advertisement -
- Advertisement -

ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో గత ఆరేళ్లుగా జైలు ఊచలు లెక్కబెడుతున్న డేరా బాబాకు మరొకసారి పెరోల్ లభించింది. ఈసారి 50 రోజులపాటు పెరోల్ మంజూరు చేస్తూ హర్యానా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డేరా బాబా అసలు పేరు గుర్మీత్ రామ్ రహీమ్. డేరా సచ్చా సౌదా అనే సిక్కు మత సంస్థకు అధిపతి. అందువల్లనే డేరా బాబా అని ఆయనకు పేరు వచ్చింది. తన ఆశ్రమానికి వచ్చే భక్తురాళ్లపై అత్యాచారాలకు పాల్పడేవాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో సిబిఐ న్యాయస్థానం డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్తక్ సునరియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. డేరా బాబాకు పెరోల్ లభించడం ఇది మొదటిసారి కాదు. 2023లో కూడా మూడుసార్లు పెరోల్ పై బయటకు వచ్చాడు. తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపిస్తూ తరచూ పెరోల్ పై బయటకు వస్తున్నాడు. హర్యానాలో నిబంధనల ప్రకారం ఏ ఖైదీ అయినా ఏడాదిలో 70 రోజులపాటు పెరోల్ పొందవచ్చు. దీనిని సాకుగా తీసుకుని డేరా బాబా పెరోల్ సంపాదిస్తున్నాడు. ఇంతవరకూ ఆయన తొమ్మిదిసార్లు పెరోల్ పొందినట్లు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News