Wednesday, January 22, 2025

పట్టాలు తప్పిన రైలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ జిల్లా విష్ణుపురం వద్ద ఘటన గంటల తరబడి రైళ్ల
రాకపోకలకు అంతరాయం ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు పలు రైళ్ల
దారి మళ్లింపు ట్రాక్ పునరుద్ధరణ …యధావిధిగా రైళ్ల రాకపోకలు

మనతెలంగాణ/హైదరాబాద్ : నల్లగొండ జిల్లా లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గుం టూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూ డ్స్ రైలుకు సంబంధించి 4,5 బోగీలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. బోగీలు పట్టాలు త ప్పగానే లోకో ఫైలట్ రైలును నిలిపివేశారు. దీం తో మరిన్ని బోగీలు పట్టాలు తప్పే ప్రమాదం త ప్పింది. గంటల తరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. ఈ నేపథ్యంలోనే ఆ మార్గంలో వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌ను మిర్యాలగూడ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నుంచి దారి మళ్లీంచారు. సుమారు ఈ రెండు రైళ్లు మూడుగంటల పాటు నిలిచిపోయాయి. మా ర్గంలో ప్రయాణించే పలు రైళ్లను ఆయా స్టేషన్‌లలో అధికారులు నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరో వై పు ట్రాక్ పునరుద్ధణ పనులను అధికారులు వెం టనే చేపట్టారు.రాత్రికల్లా పనులు పూర్తికావడంతో రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి.
రెండు రైళ్లు విజయవాడ మీదుగా….
ఈ నేపథ్యంలోనే 12704 సికింద్రాబాద్ టు హౌరా రైలును పగిడిపల్లి, కాజీపేట, వరంగల్, కొండపల్లి, విజయవాడ మీదుగా దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. 17016 సికింద్రాబాద్ టు భువనేశ్వర్ రైలును పగిడిపల్లి, కాజీపేట, వరంగల్, కొండపల్లి, విజయవాడ మీదు గా మళ్లీంచారు. 12795 విజయవాడ టు లిం గంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సమయాన్ని గం టపాటు రీ షెడ్యూల్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News