- Advertisement -
హైదరాబాద్: తన తండ్రి తనకే కాదు తెలంగాణకు హీరో అని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. ప్రతి తండ్రి పిల్లలకు హీరోనని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్ జన్మదిన సందర్భంగా కెసిఆర్ కు కెటిఆర్ తన ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్ లో మీడియాతో కెటిఆర్ మాట్లాడారు. కెసిఆర్ వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి తెలంగాణ సాధించారని కొనియాడారు. కెసిఆర్ వారసత్వానికి అర్హుడిగా ఉండేందుకు ప్రతిక్షణం కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
- Advertisement -