- Advertisement -
న్యూఢిల్లీ : మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఈ నెల 11వ తేదీ వరకూ సిబిఐ కస్టడీ విధించారు. ఈ మేరకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆదేశాలు వెలువరించింది. ఆయన మరికొందరు ఇతరులపై నమోదైన అవినీతి కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. ఎన్‌సిపి నేత అయిన దేశ్‌ముఖ్ అనుచరులు సంజీవ్ పాలండే, కుందన్ షా, బర్తరఫ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజేలను కూడా రిమాండ్‌కు తరలించారు అయితే ఇప్పుడు 71 ఏండ్ల దేశ్‌ముఖ్ స్థానిక జెజె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులతో పాటు దేశ్‌ముఖ్‌ను కస్టడీకి తీసుకోవడం కుదరదని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.
- Advertisement -