Friday, November 22, 2024

దైవిక సంబంధమే రాముని వస్త్రాల తయారీకి ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

అయోధ్య : దైవిక సంబంధం వల్లనే రామ్‌లల్లా విగ్రహానికి ఘనంగా దుస్తులను రూపొందించగలిగానని డిజైనర్ మనీష్ త్రిపాఠీ వెల్లడించారు. ఈ విగ్రహానికి సరైన ఆకర్షణీయమైన వస్త్రాల తయారీకి కావలసినవి ఎలా సమకూర్చుకున్నదీ త్రిపాఠీ వివరించారు. కాశీ విశ్వనాధుని కోసం తయారు చేసిన పీతాంబరి (పసుపు రంగు ) వస్త్రాన్ని సమకూర్చుకున్న తరువాత బంగారు , వెండి తీగలు ,సిల్కు ఉపయోగించడమైందని చెప్పారు.

దుస్తులపై వైష్ణవ చిహ్నాలతో ఎంబ్రాయిడరీ డిజైన్ చేసినట్టు తెలిపారు. ఈ విధమైన ఆలోచన చేయడానికి ఎదురైన సవాళ్లపై మాట్లాడుతూ రాముని వైభవానికి తగినట్టు అలాగే రామమందిర నిర్మాణం కోసం 500 ఏళ్లుగా నిరీక్షిస్తున్న భక్తుల అంచనాలకు తగినట్టు దుస్తులు ఉండాలని తాను భావించినట్టు పేర్కొన్నారు.

సంపూర్ణ భక్తితో భక్తులు ఎలా స్పందిస్తారో అని తపించానని, ప్రతివారి నుంచి అభినందనలు అందుకున్న తరువాత తానెంతో గర్వపడ్డానని చెప్పారు. తన తల్లి, భార్య నుంచి మంచి స్పందన పొందానని, ఈ దుస్తులను చూసి వారు చాలా అభినందించారని, వారి ముఖాల్లో చిరునవ్వు, కళ్లల్లో ఆనంద భాష్పాలు చూడగలిగానని భావోద్వేగంతో త్రిపాఠీ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News