Sunday, December 22, 2024

పేమ ప్రార్థన పట్టించుకోలేదని శివుడిని ఎత్తుకెళ్లిన ప్రేమికుడు

- Advertisement -
- Advertisement -

కౌశాంబి : ఎంతగా వేడుకున్నా శివుడు తన మొర ఆలకించలేదని ఉత్తరప్రదేశ్‌లో యువభక్తుడు ఛోటూ చివరికి విసిగిపోయి, గుడిలోని శివలింగాన్ని తస్కరించాడు. 27 సంవత్సరాల ఛోటూ ఓ అమ్మాయిని తన వైపు నుంచి గాఢంగా ప్రేమిస్తూ వచ్చాడు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు కుదరదన్నారు. దీనితో శివుడే తనకు దిక్కని నమ్మి కౌశాంబిలోని ఆలయానికి వెళ్లి ప్రతిరోజూ శివుడికి పూజలు చేస్తూ వచ్చాడు. తనను వద్దంటున్న వారి మనసు మార్చేస్తాడని నమ్మాడు.అయితే నెలరోజులు గడిచినా ఫలితం లేదని తెలుసుకుని

ఈ ప్రేమభక్తుడు కోపం వచ్చి ఏకంగా శివలింగాన్ని ఎవరికి తెలియకుండా గుడిలో నుంచి ఎత్తుకెళ్లాడు. పొదలలో దాచిపెట్టాడు. దేవుడు మాయం కావడాన్ని తెలుసుకుని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో వారు రంగంలోకి దిగి, ఈ యువకుడిని ఆరాతీయగా నేరం చేసినట్లు అంగీకరించాడు. తన ప్రేమకు దారి చూపని దేవుడిపై కోపం వచ్చి ఈ విధంగా చేశానని చెప్పి, పొదలలో దాచి ఉంచిన శివుడి జాడ చెప్పాడు. తరువాత పూజాదికాలు జరిపి తిరిగి శివుడిని గుడిలో ప్రతిష్టించారు. నేరానికి ఫలితంగా ఛోటూ జైలులో చోటు పొందాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News