Monday, December 23, 2024

తీరని శోకం

- Advertisement -
- Advertisement -

రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

మృతుల్లో ఐదుగురుది ఒకే కుటుంబం
నల్లగొండ జిల్లాలో ఘటన

మన తెలంగాణ/నిడమనూరు : నల్లగొండ జిల్లా, నిడమనూరు మండలం, వేంపాండు స్టేజీ మూడో నెంబర్ కాల్వ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మిర్యాలగూడ నుంచి పెద్దవూర నుంచి బైక్‌పై వెళ్తున్న రమావత్ శివనాయక్ (20) వేంపాడు స్టేజీ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న బలుగూరి సైదులు (57)ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమై సైదులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రమావత్ శివనాయక్‌కు తీవ్ర గాయాలు తగలడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, రమావత్ శివనాయక్‌ను చూడటానికి అతని కుటుంబ సభ్యులు ఆటోలో వస్తుండగా మూడో నెంబర్ కాల్వ సమీపంలో ట్యాంకర్ ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముడావత్ నాగరాజు (28) రమావత్ గన్యా (48), రమావత్ పాండు (45) రమావత్ బుజ్జి (38) ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు గణ్యా భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపాల్‌రావు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ,బాగా మంచు కురిసి రోడ్డు కనిపించకుండా పోవడంతోనే ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదాలు జగరకుండా పోలీసులు తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

accident 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News