Wednesday, March 5, 2025

వరంగల్ ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో శిలాఫలకం ధ్వంసం

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ సారధ్యంలో అధికారికంగా నిర్మించిన క్యాంపు కార్యాలయానికి సంబంధించిన శిలాఫలకాన్ని నాయిని రాజేందర్ రెడ్డి అనుచరులు దౌర్జన్యంగా ధ్వంసం చేశారు. ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాజేందర్ రెడ్డిపై అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని

బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని బాలసముద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయిని రాజేందర్ రెడ్డి అడుగు పెట్టిన తొలి రోజే ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా వ్యవహరించారని మండిపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీసు కమిషనర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News