Monday, January 20, 2025

ప్లాన్ ప్రకారమే అమలాపురంలో విధ్వంసం: సజ్జల

- Advertisement -
- Advertisement -

 Destruction in Amalapuram as per plan

అమరావతి: ప్లాన్ ప్రకారమే అమలాపురంలో విధ్వంసం జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు.  కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చొద్దంటూ విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టాలని విపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని శక్తులు నిరసనకారులను రెచ్చగొట్టాయని, పోలీసులు సంయమనంతో వ్యవహరించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News