Sunday, January 19, 2025

ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడిపై తమకు జూన్ 30 వరకు వ్యవధి ఇవ్వాలని కోరుతూ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బిఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. మంగళవారం (మార్చి 12) కల్లా ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని సుప్రీంకోర్టు ఎస్‌బిఐని ఆదేశించింది. మార్చి 12వ తేదీన బిజినెస్ అవర్స్(పని గంటలు) పూర్తయ్యేలోగా ఎన్నికల కమిషన్‌కు పూర్తి వివరాలను సమర్పించాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్‌బిఐని ఆదేశించింది.

ఎస్‌బిఐ నుంచి అందుకున్న సమాచారాన్ని మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా తన వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారం తమ వద్ద సిద్ధంగా అందుబాటులో ఉందని ఎస్‌బిఐ తన పిటిషన్‌లో సూచించిందని, జూన్ 30 వరకు తమకు గడువును పొడిగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. మార్చి 12వ తేదీ బిజినెస్ అవర్స్ ముగిసేలోగా వివరాలను వెల్లడించాలని ఆదేశిస్తున్నామని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. రాజ్యాం గ ధర్మాసనం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌తోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా. కాగా..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగవిర్ధుంగా పేర్కొంటూ ఈ పథకాన్ని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పులో రద్దు చేసింది.

తమ ఆదేశాలను పాటించని పక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు ఎస్‌బిఐని హెచ్చరించింది. కోర్టు ధిక్కరణ చర్యలను తాము ప్రస్తుతానికి అమలు చేయనప్పటి తమ ఆదేశాలను అమలు చేయని పక్షంలో ఉద్దేశపూర్వకంగా పాటించలేనందుకు ఎస్‌బిఐకి చర్యలు తీసకోవలసి వస్తుందని సిజెఐ చంద్రచూఢ్ హెచ్చరించారు. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని మాత్రమే సుప్రీంకోర్టు తన తీర్పులో ఎస్‌బిఐఇన ఆదేవించిందని ఎస్‌బిఐ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదడి హరీష్ సాల్వేకు సిజెఐ తెలిపారు. రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్న ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాల వెల్లడిపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటో వివరించాలని ఎస్‌బిఐని అంతకుముందు వాదనల సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం కోరింది. దీనికి హరీష్ సాల్వే తన వాదన వినిపిస్తూ ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడానికి ముందు వీటి వివరాలను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం తమకు మొదట్లో చెప్పిందని తెలిపారు. వీటి వివరాలు వెల్లడించడానికి తమకు మరి కొంత వ్యవధి కావాలని ఆయన కోరారు. సమాచారాన్ని క్రోడీకరించడానికి తాము ప్రయత్నిస్తున్నామని, మొత్తం ప్రక్రియను తాము మార్చవలసి వస్తుందని ఆయన చెప్పారు.

ఇదంతా రహస్యంగా ఉంచాలని బ్యాంకును ప్రభుత్వం ఆదేశించిందని ఆయన చెప్పారు. దీనిపై సిజెఐ స్పందిస్తూ గత 26 రోజులలో మీరు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని సాల్వేను ప్రశ్నించారు. తాము సవిరంగా అఫిడవిట్‌ను దాఖలు చేస్తామని సాల్వే తెలిపారు. ఈ వివరణపై సంతృప్తి చెందని సిజెఐ ఎస్‌బిఐ నుంచి ఇంతకన్నా ఆశించేది ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. ప్రతి ఎన్నికల బాండ్ల కొనుగోలులో కెవైసి(నో యువర్ కస్టమర్) ప్రక్రియ ఉంటుందని, ఎన్నికల బాండ్ల కొనుగోలుదారలు వివరాలు ఇప్పటికే ఎస్‌బిఐ వద్ద ఉండి ఉంటాయని ధర్మాసనం తెలిపింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఎడిఆర్), సిపిఎం దాఖలు చేసిన పిటిషన్లపై ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. తక్షణమే ఎన్నికల బాండ్ల అమ్మకాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. నగదుగా మార్చుకోని ఎన్నికల బాండ్లను వెంటనే వాటి కొనుగోలుదారులకు వాపసు చేయాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్చి 6వ తేదీ నాటికి ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని, వాటిని మార్చి 13 నాటికి అన్ని వివరాల వివరాలను తన వెబ్‌సైట్‌లో ఎన్నికల కమిషన్ పొందుపరచాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో ఆదేశించింది. కాగా.. మార్చి 6 లోగా ఎన్నికల బాండ్ల వివరాలను వెల్ల డి చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనందు కు ఎస్‌బిఐపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరు తూ ఎడిఆర్, సిపిఎం మళ్లీ పిటిషిన్లు దాఖలు చేశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News