వరుసగా నాల్గోవసారి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమి చ్చారు. ఆర్థికాభివృద్ధిని మానవీయకోణంలో ఆవిష్కరించారు. పరిపాలన అంటే వ్యాపారం కాదని, సంక్షేమ పథకాలను లాభనష్టాల దృకథంతో కాకుండా మానవాభివృద్ధి దృక్పథంతో చూడాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికతను అంకెల రూపంలో చూపిం చారు. సంక్షేమానికి ఉదారంగా నిధులు కేటాయించారు. వ్యవసా యానికి, పంచాయతీ రాజ్‌కు పెద్దపీట వేసి పల్లెబాట పట్టారు. రైతుబీమా, రైతుబంధుకు నిధులు పెంచారు. రైతుబీమా పరిధిలోకి కొత్త వారికి చోటు కల్పించారు. రూ.2,90,396 కోట్లతో భారీ బడ్జె ట్ ప్రతిపాదించారు. రెవెన్యూ మిగులు రూ.4,881 కోట్లు చూపిస్తూనే నికర లోటు రూ.623 కోట్లు చూపించారు. 202324లో రూ.46,317.68కోట్ల రుణ సేకరణను లక్షంగా నిర్దేశించు కున్నది. అయితే ఈ విషయంలో కేంద్రం ఎంతమేరకు సహకరిస్తోందో వేచి చూడాల్సిందే. కేంద్రం అనేక ప్రతిబంధకాలు కల్పిస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దౌడు తీయించే అనేక ప్రతిపాదనలను ఈ బడ్జెట్‌లో చేశారు.
2014-15 సంవత్సరంలో దేశ జిడిపిలో రాష్ట్ర వాటా 4.1 శాతం ఉండగా, 2020-21 నాటికి 4.9 శాతానికి పెరిగింది. దేశ జనాభాలో కేవలం 2.9 శాతం మాత్రమే తె లంగాణలో ఉండగా, దేశ జిడిపిలో తె లంగాణ భాగస్వామ్యం 4.9 శాతం కావ డం మనందరికీ గర్వకారణం. దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే, తెలం గా ణ మెరుగైన వృద్ధి రేటును సాధిస్తున్నది. 2015-16నుండి 2021-22 వరకు 12. 6 శాతం జిఎస్‌డిపి సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ 3వ స్థానంలో ఉంది.
సిఎం కెసిఆర్ అభిప్రాయం ప్రకారం.. పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిర మైనది, అనైతికమైనది. దేశంలో కొన్ని రాజకీ య పక్షాలు ప్రజా సంక్షేమ పథకాలను ‘రేవ డీ’ అనే పేరుతో అవహేళన చేస్తూ వ్యతిరేకి స్తున్నాయి. ఉచితాలు అనుచితం అంటూ వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రతిదాన్నీ లాభనష్టాలతో చూసేందుకు పరి పాలన వ్యాపారం కాదు. సంక్షేమ పథకాల ను లాభనష్టాల దృక్పథంతో కాకుండా మాన వాభివృద్ధి దృక్పథంతో చూడాలి. ఈ వివే కాన్ని కొన్ని రాజకీయ పక్షాలు కోల్పోవడం దురదృష్టకరం. 2019లో జరిగిన ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదే విషయంపైమాట్లాడుతూ.. ‘హమ్‌తో సర్కార్ చలా రహే హై.. వ్యాపార్ నహీ’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
మంత్రి హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఆచరిస్తుందని…దేశం అనిసరిస్తోందని వ్యాఖ్యానించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ సోమవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,11, 685 కోట్లు, మూలధన వ్యయం రూ. 37,525 కోట్లు అని వెల్లడించారు. 202324కు తలసరి ఆదాయం రూ.3 లక్షల 17 వేల 175గా ఉంది. ఇక వ్యవసాయం, నీటిపారుదల, విద్యా, వైద్య రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కేంద్రంపై ఫైర్ అయ్యారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర నిధులకు కోత పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదని, ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీలను కూడా పరిష్కరించలేదని చెప్పారు. కేంద్రం తీరుతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, తద్వారా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సారథ్యంలో రాష్ట్రం ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని చెప్పారు. ప్రజాసంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నదని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు.
రైతుల కళ్ళల్లో ధీరత్వం తొణికిసలాడుతున్నది
వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయశాఖకు రూ.26,831 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. నిలువెల్లా రైతు స్వభావాన్ని నింపుకున్న రాష్ట్ర సిఎం కెసిఆర్ పాలనలో రైతుల కళ్ళల్లో దీనత్వం తొలిగి, ధీరత్వం తొణికిసలాడుతున్నదని చెప్పారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందిస్తున్నదని తెలిపారు. రైతులకు ఆయిల్ పామ్ మొక్కలు, ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్ అన్నింటిపై ఇస్తున్న భారీ సబ్సిడీల కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నదన్నారు. ఆయిల్ పామ్ సాగుకు బడ్జెట్ లోరూ.1,000 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం, జాతీయ తలసరి వినియోగం కన్నా 69 శాతం ఎక్కువగా నమోదవడం మనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. విద్యుత్తు శాఖ కోసం ఈ బడ్జెట్‌లో రూ.12, 727 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.
ఆసరా ఫించన్లకు రూ.12 వేల కోట్లు
గత బడ్జెట్‌లో చెప్పిన విధంగా 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇవ్వటం జరుగుతున్నదని హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు 2022లో కొత్తగా 8,96,592 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. దళిత సోదరులు వ్యాపార రంగంలోనూ ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నదని చెప్పారు. దళితబంధు పథకం కోసం ఈ బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. షెడ్యూలు కులాలు, తెగల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్నదని తెలిపారు. ఈ బడ్జెట్‌లో షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కిందరూ.15,233 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.
బిసిల సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
వృత్తిపనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నదని మంత్రి తెలిపారు. ఈ బడ్జెట్‌లో బిసిల సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సహకాలందించే ఉద్ధేశ్యంతో‘నేతన్నకు చేయూత’ పొదుపు పథకానికి శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. గౌడన్నల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకొన్నదని మంత్రి తెలిపారు. గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరాను సాఫ్ట్ డ్రింక్ గా మార్చి అందించే ప్రాజెక్టును చేపట్టిందని వెల్లడించారు. బిసి సంక్షేమం కోసం ఈ వార్షిక బడ్జెట్‌లో రూ.6,229 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
తెలంగాణ ఏర్పడగానే పేదలకు రేషన్ బియ్యం పంపిణీపై గత ప్రభుత్వాలు విధించిన పరిమితులను ఎత్తివేసిందని మంత్రి గుర్తు చేశారు. కరోనా సమయంలో కూడా 4,072 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసిందని చెప్పారు. ఈ సంవత్సరం ప్రజా పంపిణీ వ్యవస్థకు రాష్ట్ర బడ్జెట్ లోరూ.3,117 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.
కల్యాణలక్ష్మి పథకానికి రూ.3,210 కోట్లు
ఆడ పిల్లల పెండ్లి ఖర్చుల భారం భరించలేక నిరుపేద కుటుంబాలుపడుతున్న బాధలను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి కెసిఆర్ వారి భారాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకాన్ని అమల్లోకి తెచ్చారని మంత్రి తెలిపారు. 18 ఏండ్లు నిండిన ఆడ పిల్లలకే కల్యాణ లక్ష్మి సాయం వర్తిస్తుండటంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పారు. కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్ కోసం ఈ బడ్జెట్‌లో రూ.3,210 కోట్ల నిధులు ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లోమౌలిక వసతుల కల్పన, హాస్టల్ భవనాల ఆధునీకరణ కొత్త భవనాల నిర్మాణం కోసం రూ.500 కోట్లు ఈ వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పలు జిల్లాల్లో కొత్త కాలేజీలు..
విద్యాశాఖకు ఈ బడ్జెట్‌లో రూ.19,093 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. 2023-24 విద్యాసంవత్సం నుంచి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించబోతున్నదని చెప్పారు. జెఎన్‌టియుహెచ్ పరిధిలో 4 కొత్త ఇంజినీరింగ్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని, వీటిలో సిరిసిల్ల, వనపర్తి కళాశాలలు ఇప్పటికే ప్రారంభం కాగా, త్వరలోనే మహబూబ్ నగర్, కొత్తగూడెంలో ప్రారంభించబోతున్నదని తెలిపారు. అలాగే సుల్తాన్ పూర్‌లో జెఎన్‌టియుకు అనుబంధంగా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫార్మాసుటికల్ సైన్సెస్‌ను ఏర్పాటు చేసిందని అన్నారు. వైద్య, ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో రూ.12,161 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. కంటి వెలుగు పథకం దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచిందని మంత్రి వ్యాఖ్యానించారు. ఇటీవలనే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారి చేతుల మీదుగా ఖమ్మంలో ప్రారంభించుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ తమ తమ రాష్ట్రాల్లోనూ కంటివెలుగును అమ లు చేస్తామని ప్రకటించడం గర్వకారణమన్నారు.
దివ్యక్షేత్రం యాదాద్రి
తెలంగాణ అవతరణ తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనలో, మన కండ్లముందు ఆవిష్కృతమైన మరో అద్భుతం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అలాగే ఆచార్య నాగార్జునుడు నడయాడిన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధ వనాన్ని అద్భుతంగా నిర్మించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 29 జిల్లాల్లో 1581 కోట్లతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టిందని, వీటిలో 17 భవనాలను ఇప్పటికే ప్రారంభం కాగా, మరో 11 కలెక్టరేట్ల పనులు తుది దశలో ఉన్నాయని చెప్పారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ద్వారా రహదారుల నిర్వహణ మరమ్మతుల కోసం బడ్జెట్ లో 2 వేల 500 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖలో ధరణి ద్వారాసమూలమైన మార్పులు చేపట్టడంవలన రాష్ట్రంలో భూ వివాదాలను కనీసస్థాయికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. రెవెన్యూశాఖతో కొత్త రిజిస్ట్రేషన్ వ్యవస్థను అనుసంధానం చేయడం వల్లపారదర్శకత పెరిగి అవినీతికి అడ్డుకట్ట పడిందని చెప్పారు.
హోమ్ శాఖకు రూ.9,599 కోట్లు
శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరిగితేనేసమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో హోమ్ శాఖకు రూ.9,599 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో మొత్తం గ్రీన్ కవర్ 1.70 శాతం పెరిగిందన్నారు. రూ.1500 కోట్ల వ్యయంతో 13 లక్షల ఎకరాల అడవికి తెలంగాణ ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించిందని తెలిపారు. అటవీశాఖ, తెలంగాణ హరితహారానికి ఈ బడ్జెట్‌లో రూ.1471 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధిని కార్పస్ ఫండ్‌కు కేటాయించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రూ.15 కోట్లతో నిర్మిస్తున్న మీడియా అకాడమీ భవన నిర్మాణం తుది దశకు చేరుకుందన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్ల నిధి సమకూర్చినట్లు తెలిపారు.
మా మనోబలం చెక్కు చెదరదు
దేశంలో ప్రతీఘాతుక శక్తులు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో తెలంగాణ గంగా జమునా తెహజీబ్ ను పరిరక్షిస్తూ శాంతి, సామరస్యాలను కంటికి రెప్పలా కాపాడుతున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మా మనోబలం గానీ, మాకున్న ప్రజాబలం గానీ చెక్కు చెదరదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లోనూ జాతి నిర్మాణంలో తెలంగాణ మరింత ఉజ్వల పాత్రను నిర్వహించే విధంగా పురోగమిస్తుందని ఆకాంక్షించారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, అగ్రవర్ణ పేదలు అందరి జీవితాల్లో సంపూర్ణమైన వికాసాన్ని సాధించేంత వరకూ విశ్రాంతీ, విరామం ఎరుగక పరిశ్రమిస్తూనే ఉందామని, ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉందామని చెప్పారు.ఇందుకోసం రాజీలేని మార్గాన్ని అనుసరిస్తామనీ, ఈ మహా సంకల్పానికి సంపూర్ణమైన అండదండలు అందించాలని తెలంగాణ ప్రజానీకాన్ని మంత్రి హరీశ్‌రావు కోరారు.