Thursday, January 23, 2025

ఆకట్టుకుంటున్న డిటెక్టివ్ కార్తీక్ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

మిస్టర్ అండ్ మిస్, ఓ స్త్రీ రేపు రా, మహానటులు వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి తాటిపర్తి రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ పై నిర్మాతగా చేస్తున్న కొత్త సినిమా డిటెక్టివ్ కార్తీక్. ఈ చిత్రానికి వెంకట్ నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శ్రుతి మోల్, అనుష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారి మరియు యేషో భరత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

డిటెక్టివ్ కార్తీక్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…పదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ అమ్మాయి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సంధ్య అనే యువతి కూడా మిస్సింగ్ అవుతుంది. సంధ్యను ప్రేమిస్తున్న అబ్బాయి కార్తీక్ ఆమె మిస్సింగ్ కేసుతో పాటు పాటు స్కూల్ స్టూడెంట్ మర్డర్ కేసును కూడా ఛేదించాలని చూస్తాడు. కానీ అతని ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో డౌట్స్, హర్డిల్స్ ఎదురవుతాయి. ఎన్ని కోణాల్లో చూసినా క్లూస్ దొరకవు. ఇంత క్లిష్టమైన కేసును హీరో ఎలా సాల్వ్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. స్మాల్ బడ్జెట్ లో కూడా టెక్నిక్ ఉంటే మేకింగ్ లో మంచి క్వాలిటీ తీసుకురావచ్చని ఈ చిత్ర ట్రైలర్ చూపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News