Sunday, December 22, 2024

సమాజంలో దిగజారుతున్న మానవ సంబంధాలు, విలువలు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : నేటి సమాజంలో మానవ సంబంధాలు, నైతిక విలువలు దిగజారిపోతున్నాయని, అన్నిచోట్ల స్వార్థం పెరిగిపోయిందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఏ పనులైన, కార్యక్రమాలను తలపెట్టిన వక్తలను పిలిస్తే తమకేంటి లాభం అనే దృష్ఠితో ఆలోచిస్తున్నారన్నారు. శుక్రవారం రాత్రి రవీంధ్రభారతి కాన్ఫరెన్స్‌హాల్ వేదికగా కిన్నెర ఆర్ట్‌థియోటర్స్, ద్వానా సాహితీ కుటీరం పక్షాన ప్రముఖ కవి,రచయిత కూరెళ్ల విఠలాచార్యకు కిన్నెర, ద్వానాశాస్త్రి స్మారక అవార్డును ఆయన ప్రదానం చేశారు.

అనంతరం మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానానికి చేరుకున్నామని, చైనాను జనాభాలో భారత్ దేశం దాటేసిందన్నారు. సమాజంలో పాపాలు, నేరాలు పెరిగిపోతున్నాయి. కానీ మానవ సంబంధాలు, విలువలు మాత్రం తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. పిల్లలు విదేశాల్లో ఉండటం వల్ల వారి ఇళ్లలో తల్లిదండ్రులు ఉండలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకే అనేకమంది వృధ్దాశ్రమంలో చేరుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి సభాధ్యక్షత వహించారు. మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సాహితీవేత్త వో లేటి పార్వతీశం, ద్వాదశి శశీకాంత్, కన్నెర ఆర్ట్ థియోటర్స్ కార్యదర్శి మద్దాళి రఘరాం, కళాసేవకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News