Monday, December 23, 2024

జై బోలో కృష్ణ సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సెకెండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ మేకర్స్ సెకెండ్ సింగిల్ జై బోలో కృష్ణ పాటతో ముందుకొచ్చారు. ఈ పాటని సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేశారు. టైటిల్ సూచించినట్లు జై బోలో కృష్ణ జన్మాష్టమి స్పెషల్ సాంగ్. ఇందులో హీరో తన బ్యాచ్‌తో కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకోవడం అలరించింది. భీమ్స్ సిసిరోలియో ఎనర్జిటిక్ బీట్‌లతో ఆకట్టుకునే ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేశాడు. స్వరాగ్ కీర్తన్ సూపర్బ్ సింగింగ్‌తో పాటకు ఎక్స్‌ట్రా ఎనర్జీని అందించాడు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పిరిచువల్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News