Sunday, December 22, 2024

దేవర-2కు కాస్త సమయం పట్టొచ్చు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా సెప్టెంబర్ 27న విడుదలై థియేటర్లలో మంచి విజయాన్నే సాధించింది. కాగా ఎన్టీఆర్ అభిమానులు దాని సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. దేవర సినిమాకు మిక్స్ డ్ రివ్యూలే వచ్చాయి. ఏడు రోజుల్లో ఆ సినిమా రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది.

అయితే ‘దేవర-2’ కాస్త ఆలస్యం కావొచ్చని సమాచారం. సీక్వెల్ 2 ని మరింత పెద్దగా, మెరుగ్గా తీయాలనుకోవడం వల్లే ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్నే జూనియర్ ఎన్టీఆరే స్వయంగా తెలిపారు. సీక్వెల్ 2 కథ సిద్ధంగానే ఉందని, కానీ దాన్ని కాస్త మెరుగ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు తెలిపారు. ‘‘నేను దర్శకుడికి నెలన్నర రోజుల పాటు సెలవు తీసుకొని ఎంజాయ్ చేసి రమ్మన్నాను. ఆ తర్వాత దేవర-2 మొదలెడతాం’’ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News