Tuesday, September 17, 2024

దేవర నుంచి క్రేజీ అప్డేట్.. సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది..

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఈ మూవీ అత్యద్భుతంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, టీజర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు.

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ రెండో సాంగ్‌పై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలోని రెండో సాంగ్‌ను ఈనెల 5న రిలీజ్ చేయబోతున్నట్లు వారు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇది ఓ రొమాంటిక్ సాంగ్‌గా ఉండబోతుందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అందాల జాన్వీ కపూర్ నడుముపై ఎన్టీఆర్ చేయి వేసి ఆమె కళ్లలోకి చూస్తున్నట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఇక ఈ సినిమాలో తారక్ ఓ సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు. జాన్వీ కూడా చాలా బ్యూటీఫుల్‌గా ఈ పోస్టర్‌లో ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధ ఆర్ట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News