- Advertisement -
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం శరవేగంగా రూపొందుతోంది. ఈ మూవీ రెండు భాగాలుగా రానున్న సంగతి అభిమానులకు తెలిసిందే. దేవరతో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న దేవర నుంచి తారక్, సైఫ్, జాన్వీకపూర్ లుక్ లను ఇప్పటికే రిలీజ్ చేశారు. కొత్త సంవత్సరం కానుకగా దేవర నిర్మాతలు తాజాగా పోస్టర్ విడుదల చేశారు. సముద్రం మధ్యలో పడవలో నిలబడి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పోజుతో ఉన్న పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
- Advertisement -