Friday, December 20, 2024

మూడో సాంగ్ నెక్ట్స్ లెవల్‌లో..

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవర. భారీ అంచనాలున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సెన్సెషనల్ చార్ట్‌బస్టర్ అయ్యాయి. ఇప్పుడు అభిమానులు మూడో సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాంగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంని అంటున్నారు. ‘దేవర’లో ఇది ఆయుధ పూజ సాంగ్ అంటూ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. నేను ఆయుధపూజ సాంగ్ షూట్ చూస్తూ ఎమోషనల్ అవుతుంటే పక్కనుంచి మా కొరటాల శివ.. డాన్స్ డ్యూయెట్ అయితే వేరే స్థాయి పూనకాలే అని అన్నారు. ఆదే మాట మీతో చెబుతున్నా అంటూ పోస్ట్ చేసారు. దీనితో ఇప్పుడు తారక్ అభిమానుల్లో ఈ సాంగ్ కోసం మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధ ఆర్ట్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News